అన్‌స్టాపబుల్ విత్ [email protected] మోహన్ బాబు

35
nbk

బుల్లితెరపై నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో బాలయ్య టాక్ షో చేయబోతుండగా గురువారం అధికారికంగా ప్రకటించనుంది ఆహా సంస్థ. బాప్ ఆఫ్‌ ఆల్ టాక్ షోస్… అన్ స్టాపబుల్ అంటూ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా తొలి గెస్ట్‌గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు అలరించనున్నారు.

ఆహా రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా నవంబర్ 4 నుంచి షో మొదలుకానుంది. మోహన్ బాబు ని ఇంటర్వ్యూ చేసిన తరువాత సెట్ లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా నడిచిందని, సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉన్నారని తెలుస్తోంది.

ఇటీవల మా ఎన్నికల్లో మంచు విష్ణుకు బాలయ్య సపోర్టు చేశారు. విష్ణు గెలిచిన అనంతరం బాలయ్య ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో మంచు- నందమూరి ఫ్యామిలీ మధ్య బంధం మరింత బలపడింది.