మల్లన్నకు 14 రోజుల డిమాండ్..

113
Teenmar Mallanna
- Advertisement -

తీన్మార్ మల్లన్నకు జైలు కష్టాలు తప్పడం లేదు. తాజాగా డబ్బుల కోసం కల్లు వ్యాపారిని బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇదే కేసులో మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్ ఎ1 నిందితుడు కాగా, మల్లన్న ఎ2 నిందితుడుగా ఉన్నారు.

ఈ నెల 10న నిజామాబాద్‌లో కేసు నమోదు కాగా, అదే రోజున సంతోష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఆ సమయంలో మల్లన్న మరో కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్నారు. న్యాయస్థానం అనుమతితో చంచల్‌గూడ నుంచి మల్లన్నను తీసుకొచ్చిన పోలీసులు నిన్న నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో మల్లన్న మరికొద్ది రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -