దేశంలో తగ్గినా కరోనా కేసులు..

77
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.గత 24 గంట‌ల్లో దేశంలో 12,428 క‌రోనా కేసులు న‌మోదుకాగా 356 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,42,02,202కి చేరగా ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులుండగా దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,55,068 మంది క‌రోనాతో మృతి చెందారు.