కేజ్రివాల్ పై మోడీ కక్ష గట్టారా?

27
- Advertisement -

దేశ రాజధాని డిల్లీపై ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం గట్టిగా ఉండడంతో బీజేపీ కలలు కలలుగానే మిగులుతున్నాయి. ఆప్ ను దెబ్బతీయాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఇక ఈ మద్య ఆప్ నేతలే టార్గెట్ గా మోడీ సర్కార్ వ్యవహృంచిన తీరును బట్టి చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ని బీజేపీ ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో ఇట్టే అర్థమైపోతుంది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆప్ నేతలే టార్గెట్ గా కేంద్రం వ్యవహరిచడం, తరచూ కేజృవాల్ ను టార్గెట్ గా చేసుకొని మోడీ విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారు..

అయితే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని ఈ స్థాయిలో టార్గెట్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు దేశ రాజకియాల్లో కాంగ్రెస్ తరువాత బీజేపీకి పోటీనిచ్చే పార్టీగా ఆప్ విస్తరిస్తోంది. ఆప్ ను ఏమాత్రం కట్టడి చేయలేకపోతే బీజేపీ స్థానాన్ని ఆ పార్టీ ఆక్రమిచ్చిన ఆశ్చర్యం లేదనే చెప్పవచ్చు. అందుకే ప్రతి దశలోనూ ఆప్ కు షాక్ ఇచ్చేలా మోడీ సర్కార్ వ్యవహృస్తోంది. ఇక ఇటీవల ఆప్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టె విధంగా డిల్లీ అధికార బదలీల ఆర్డినెన్స్ ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. శాసన, పాలనధికారం ప్రజలు ఎన్నుకొన్న ఆప్ ప్రభుత్వానికే అని ఆ మద్య సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ.. కేంద్రం మాత్రం అందులో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం తప్పనిసరి అని కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

Also Read:Karan Johar:బర్త్ డే స్పెషల్

దీంతో అధికార బదలీలు, విజిలెన్స్ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు కేంద్రం నియమించిన కమిటీతో చర్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానమే ఆప్ సర్కార్ ను తీవ్ర ఇరకాటంలో పెడుతోంది. ఇది పూర్తిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్నికి వ్యతిరేకమని కేజృవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ ఆధినేత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ వంటివారు కేజృవాల్ కు మద్దతుగా నిలిచారు. ఇక తాజాగా శరత్ పవార్, ఉద్దవ్ థాక్రే, వంటివాళ్లు కూడా కేంద్ర నిర్ణయంపై వ్యతిరేకత చూపుతున్నారు. దీంతో కేంద్ర వైఖరిపై విపక్షాల మద్దతు కూడాగడుతున్న కేజ్రివాల్ తదుపరి ఎలాంటి ప్లాన్ తో మోడీ సర్కార్ ను ఎదుర్కొబోతున్నారనేది దేశ రాజకియాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read:సినీ లోకంలో నేటి విషాదాలు

- Advertisement -