మేకిన్ ఇండియాలో భాగంగా వంద వందే భారత రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా…హైదారాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 8వ రైలు కూత పెట్టడానికి సిద్దమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వారంలో ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.30గంటలకు మోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించనున్నారు. వందేభారత్ రైలులో 14 ఏసీ చైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్‌లు ఉండనున్నాయి. ఇందులో మొత్తంగా 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు. విశాఖపట్నం స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రతిరోజు రెండు ట్రిప్పులు నడుపుతారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్(20833)కు నడిచే రైలు ఉదయం విశాఖపట్నంలో 5.45గంటలకు బయలుదేరుతుంది. రాజమండ్రి ఉదయం 7.55, విజయవాడ ఉదయం 10.00, ఖమ్మం ఉదయం 11.00, వరంగల్ మధ్యాహ్నం 12.05, సికింద్రాబాద్ 2.15గంటలకు చేరుకుంటుది.
సిక్రింద్రాబాద్ నుంచి విశాఖకు(20834) మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి వరంగల్ 4.35, గంటలకు ఖమ్మం సాయంత్రం 5.45 గంటలకు, విజయవాడ రాత్రి 7గంటలకు, రాజమండ్రి రాత్రి 8.58గంటలకు, విశాఖపట్నం రాత్రి11.30గంటలకు చేరుకుంటాయని దక్షిణమధ్యరైల్వే పేర్కొంది.
ఏసీ చైర్ కార్ ఛార్జీ
- విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రూ.1720
- విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ.625
- విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌వరకు రూ.960
- విశాఖపట్నం నుంచి ఖమ్మంకు రూ.1115
- విశాఖపట్నం నుంచి వరంగల్‌కు రూ.1310
ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఛార్జీ
- విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రూ.3170
- విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ.1215
- విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌వరకు రూ.1825
- విశాఖపట్నం నుంచి ఖమ్మంకు రూ.2130
- విశాఖపట్నం నుంచి వరంగల్‌కు రూ.2540
క్యాటరింగ్ ఛార్జీ
- ఏసీ చైర్ కార్ ఛార్జీలు – రూ. 364
- ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీలు – రూ. 419
ఇవి కూడా చదవండి…