డబ్ల్యూఎఫ్‌సీ చైర్‌పర్సన్‌గా ఆకుల లలిత.. ఎమ్మెల్సీ కవిత విషెస్‌..

28

తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శుక్రవారం ఆకుల లలిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.