‘పుష్ప’ మొదటి వారం వసూళ్లు..

42

అల్లు అర్జున్ – రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. తొలిరోజే ఆలిండియా రికార్డు నెలకొల్పుతూ రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిన పుష్ప… మొదటి వారం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.229 కోట్ల గ్రాస్‌తో అదరగొట్టింది. మరో రెండు వారాల పాటు పుష్ప హవా కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫహద్ ఫజల్ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.