సేవాలాల్ ఆలయ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత..

55
kavitha

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ‌ఇందల్వాయి మండలం దేవితండాలో సేవాలాల్ ఆలయ 8వ వార్షికోత్సవం మరియు ‌రాజగోపురం ప్రతిష్టాపన‌ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజగోపురం ప్రతిష్టాపన‌ చేశారు. ఈ ఉత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించింది.