సొహైల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్‌!

459
sohail

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. విన్నర్‌గా అభిజిత్ నిలవగా మూడో స్ధానంలో నిలిచారు సొహైల్. ఇక సొహైల్ రూ. 25 లక్షల ప్రైజ్‌మనీతో బయటకు రాగా మెగాస్టార్ చిరంజీవి సొహైల్ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారు.

తాజాగా లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కూడా సోహెల్‌కు ఆఫర్ ఇచ్చాడు. స్వయంగా సొహైల్‌కి కాల్ చేసి నీ సినిమాలో ఫ్రీగా నటిస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం సోహెల్ స్వయంగా వెల్లడించారు.

గతంలోనే యురేకా లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు సోహెల్. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయినట్లు కూడా ఎవరికి తెలియదు. అయితే బిగ్ బాస్ తర్వాత సొహైల్ లైఫ్ స్టైల్ మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.