పెట్టుబడులకు కేంద్రస్థానం తెలంగాణ: ఎమ్మెల్సీ కవిత

49

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్‌, సింగిల్‌ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఫర్నిచర్ షోరూంలో ఉద్యోగాలన్ని స్థానిక యువతకే ఇస్తానని తెలిపిన నిర్వాహకుడు కిరణ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.