ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..!

72

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీన ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని ఐసీసీ నేడు వెల్లడించింది. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు రూ.12.02 కోట్లు ఇవ్వనున్నారు. రన్నరప్ జట్టుకు రూ.6 కోట్లు దక్కనున్నాయి. సెమీఫైనల్లో ఓటమి పాలయ్యే జట్లకు రూ.3 కోట్ల చొప్పున నజరానా లభించనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.