మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌దే: ఎమ్మెల్సీ కవిత

46
kavitha

గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా పయనిస్తోందని అన్నారు. బ్యాలెట్ల లెక్కింపు కావడంతో కచ్చితమైన సంఖ్య కోసం మరో మూడ్నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. కౌంటింగ్ జరిగే కొద్దీ బీజేపీ ఆధిక్యం తగ్గుతుందని, టీఆర్ఎస్ కారు జోరు పెరుగుతుందని ఉత్సాహంగా చెప్పారు. మేయర్ పీఠం తమదేనని ధీమాగా చెప్పిన కవిత… తద్వారా అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కాగా, తాజాగా సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుతానికి టీఆర్ఎస్ ది పైచేయిగా నిలిచింది. 19 డివిజన్లలో నెగ్గి మరో 40 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 8 డివిజన్లు కైవసం చేసుకుని 32 డివిజన్లలో ఆధిక్యం సంపాదించింది. ఎంఐఎం 20 డివిజన్లు గెలిచి మరో 17 డివిజన్లలో విజయం దిశగా ఉరకలేస్తోంది. కాంగ్రెస్ కు 2 డివిజన్లు దక్కాయి.