యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిఖత్‌ :కవిత

125
Nikath and MLC Kavitha
- Advertisement -

కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50 కిలోల విభాగంలో బాక్సింగ్‌లో బంగారు పతకం ని గెలిచిన నిఖత్ జరీన్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా కవిత గోల్డ్ మెడల్ ని నిఖత్ మెడలో వేసి, శాల్వాతో ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కవిత తెలిపారు.

ఇక నిఖత్ జరీన్‌ గతం లో ఆర్థికంగా ఆదుకోవాలని కవితను కలిసారని, తన వినతికి కవిత వారిని సీఎం కేసీఆర్ ని కలిసేలా చేశారని, దాంతో సీఎం కేసీఆర్ రూ.50 లక్షలు వారికి మంజూరు చేశారని, అదనంగా రూ.2కోట్లు మంజూరు చేయడంతో పాటు నివాస స్థలం కేటాయించారని ,తనకు ఆర్థికంగా సహాయాన్ని అందిస్తూ తన విజయానికి కారణభూతులయ్యారని పేర్కొంది. తన వినతికి స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరియు ఆర్థిక సహాయాన్నిఅందించిన సీఎం కేసీఆర్‌కు నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలియచేశారు.

- Advertisement -