నిజామాబాద్ బాధితురాలికి అండగా నిలుస్తాం- ఎమ్మెల్సీ కవిత

29

నిజామాబాద్ నగరంలో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించదు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు అని స్పష్టం చేశారు.

మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు. నిజామాబాద్‌లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మరియు వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.