ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపిన NRI TRS..

135
mlc kavitha

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితను నేడు హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే నాయకులు. ఈ కార్యక్రమంలో సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన, ప్రవీణ్ కుమార్ పంతులు మరియు సామాజిక కార్యకర్త వినయ్ కుమార్ బత్తిని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత ప్రవాసుల మరియు వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా, వివిధ దేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తున్నందున తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఎన్నారై టీఆర్‌ఎస్ నాయకులు కవితకు తెలిపారు.