ఆంద్ర జల దోపిడి పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి గా పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ. ఖమ్మం జిల్లాలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బాలసాని…కాంగ్రెస్ , బీజేపీ తీరు గురువింద చందంగా ఉందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుద్దులు భట్టి , ఉత్తమ్ కుమార్ రెడ్జి నాడు వైఎస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యం పెంచినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. కోటి ఎకరాల మాగాణం కోసం కేసీఆర్ రాత్రి పగలు కష్టపడుతున్నారని చెప్పారు.
సూర్యపేటకు నీళ్లు ఎలా వచ్చాయో ఉత్తమ్ కు కనబడదా .. పాలేరు నీళ్లు భట్టికి కనబడదా..?? అని ప్రశ్నించారు. శబరి ఎక్కడుందో… రుద్రమకోట ఎక్కడ ఉందో భట్టికి తెలియదు ..!! అసలు భట్టి అక్కడకు పోలేదన్నారు. కాంగ్రెస్ రాజకీయ కుట్రతో ఆరోపణలు చేస్తుందన్నారు.
ఉదయం 10:30 కి టిపిన్ చేసి 12 గంటలకు భోజనం చేస్తే అది దీక్షా ..???తిన్నదరక దీక్ష చేశారా..?? అని ఎద్దేవా చేశారు బాలసాని. వైఎస్ తొత్తులుగా వ్యవహరించిన టీ. కాంగ్రెస్ నేతలు తెలంగాణ కు క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు ఆంద్ర పార్టీల పెత్తనం సాగనీయ్యం అన్నారు. భట్టికి సవాల్ చేస్తున్న ..? శబరి , రుద్రమ కోట చూసివద్దాం వస్తావా…?? అంటూ సవాల్ విసిరారు.
పోతిరెడ్డి పాడుకు అనుమతి ఇచ్చినప్పుడు భట్టి ఎందుకు మాట్లాడలేదని ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రశ్నించారు. రాజకీయ ఎజెండా లేకా కాంగ్రెస్ పోతిరెడ్జి పాడు పై అబద్దాలు మాట్లాడుతుందన్నారు. మధిరలో ఏ పని చేయాలన్నా 10 శాతం కమిషన్ లేనిదే భట్టి కొబ్బరికాయ కూడా కొట్టడని..పోతిరెడ్డి పాడు పై జీవో 203 రద్దు చేసే వరకు పోరాడతాం అన్నారు.