జూన్ 30 వరకు ప్యాసింజర్ రైళ్లు రద్దు..!

116
indian railways

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తున్న సమయంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని తెలిపింది. దీంతో తో జూన్ 30 వరకు శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా ప్యాసింజర్ రైళ్లు నడిచే పరిస్ధితి లేదు.