జూమ్‌లో క్లాసులు వింటున్న ఎమ్మెల్యే వంశీ..

33

రాష్ట్రంలో అ ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేసిన.. ఏం మాట్లాడిన సంచలనమే. అయన ఎవరో కాదు కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఈ మధ్య ఆయన హైదరాబాద్ ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో చేరారు. నెలలో 15 రోజుల పాటు హైదరాబాద్ నేరుగా బిజినెస్ స్కూల్‌కు వెళ్లి క్లాసులు విన్నారు. అయితే ఎక్కువ రోజులు హైదరాబాద్‌లో ఉండటం వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించటం.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనడటం ఇబ్బందిగా మారింది.

ఈక్రమంలో ఆయన నియోజకవర్గంలోని గ్రామాలకు పర్యటనకు వెళ్లిన సమయంలో బిజినెస్ స్కూల్ జూమ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిపుణులు ఇచ్చే శిక్షణ తరగతులు ఓ సాధరణ విద్యార్ధిగా హాజరు అవుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో పెండింగు పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమీక్ష సమావేశాలు, సూచనలు ఇస్తూ బీజీ బీజీగా గడుపుతున్నారు.