‘రైతన్న’ సినిమా అద్భుతం- ఎమ్మెల్యే కృష్ణమెహన్ రెడ్డి

32

ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని నవరంగ్ థియేటర్‌లో ఆర్ నారాయణ మూర్తి నటించిన ‘రైతున్న’ చిత్రాన్ని రైతుబిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన నాయకుడుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి రైతన్న సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తితో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ప్రతి ఒక్కరు తమ మద్దతు తెలుపుతూ రైతు గళాన్ని వినిపించిన.. ఈ రైతన్న సినిమా చూసి ఆదరించాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయం ఒక జీవన విధానమని, రైతు ఏ ఒక్క కార్పొరేట్ గుప్పిట్లోకి వెళ్లకుండా మన స్వరాన్ని వినిపించాల్సిన అవసరం వచ్చిందని, కావున ప్రస్తుత కాలంలో రైతుల స్థితిగతులు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టాలు వంటి నల్ల చట్టాల వల్ల భవిష్యత్‌లో రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ ఆర్ నారాయణ మూర్తి గారు తీసిన ఈ సినిమా అద్బుతమని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రజల చైతన్యం చేసే మంచి మంచి సినిమాలు తీసేందుకు ఆర్ నారాయణ మూర్తి గారికి ఆర్థిక సామర్థ్యంతో మానసిక సామర్థ్యం నింపేందుకు ప్రతి రైతు ఖచ్చితంగా సినిమా చూసి ఆదరించాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.

అర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. తాను డబ్బులు పెట్టి హీరోగా అయ్యేందుకు సినిమా తీయలేదని, ప్రజల గుండెల్లో దాగి ఉన్న వాడినని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ధర్నాలు చేశారు. అదేవిధంగా రైతు వ్యతిరేకి వ్యతిరేకమైన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరారు. రైతుల పక్షాన నిలబడడం అభినందనీయమన్నారు.

నల్ల చట్టాలపై పోరాడిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రంలో రైతుల ధర్నా చేస్తూ మరణించిన రైతు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకారమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలవడం జరుగుతుంది. త్వరలోనే రైతే రాజు కావడం సాధ్యమవుతుంది. గద్వాల ఎమ్మెల్యే రైతన్న సినిమాకు మద్దతు తెలపడంతో పాటు సినిమాను చూడాలని ప్రజలు, రైతులకు పిలుపునివ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.