పవన్ దీక్షపై మంత్రి సుచరిత కామెంట్స్‌..

31

గుంటూరులో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ దీక్షపై ఏపీ హోమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అన్నారు.

బిజెపి మద్దతుతో ఉన్న జనసేన కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడాలి. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేక హోదా కోసం ఆనాడు ప్యాకేజీ, ఇప్పుడు రాజీనామాలని చంద్రబాబు అంటున్నాడు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు మంత్రి పేర్కొన్నారు.