నారా భువ‌నేశ్వ‌రిపై ఎమ్మెల్యే రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

32

నారా భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువ‌నేశ్వ‌రిపై గౌరవం ఉందని.. అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టు కోకండంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని.. చంద్రబాబు చేసిన పాపలకు పోయిన ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చుర‌క‌లు అంటించారు.

ఏపీలోని ప‌లు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు నిన్న‌ ఎన్టీఆర్‌ ట్రస్టు తరపున టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడి భార్య‌ నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున సాయం అందజేసిన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఇటీవల తన గురించి త‌ప్పుడు మాట‌లు మాట్లాడినందుకు కుంగిపోయానని, ఆడ‌వారిని క్షోభ‌పెడితే బాగుప‌డ‌ర‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.