Chandrababu: టీడీపీతో టచ్ లోకి ?

19
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఒక పార్టీలో పొసగని వారు ఇవే పార్టీ చెంతకు చేరడం, సీటు దక్కని వారు వెంటనే కండువా మార్చడం రాజకీయాల్లో షరామామూలే. ఈసారి ఎన్నికల వేళ ఈ జంపింగ్ జపాంగ్ రాజకీయం మరింత పెరిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి ఇతర పార్టీలలోకి నేతలు భారీగా వలసలు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మద్య వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అభ్యర్థుల మార్పులు.. వంటి అంశాల కారణంగా పార్టీలో అసంతృప్త వాదుల సంఖ్య గట్టిగానే కనిపిస్తోంది. వారంతా కూడా మూకుమ్మడిగా వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. .

ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ ల మార్పు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి.. ఆరు జాబితాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఇక ఏదో జాబితాలో కూడా కొంత మార్పులు చేపట్టి బరిలో నిలిచే అభ్యర్థులను ఫైనల్ చేయనునట్లు వినికిడి. దాదాపు 40-60 స్థానాల్లో ఇంచార్జ్ ల మార్పు జరగడంతో టికెట్ లభించని వారంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నట్లు గత కొన్నాళ్ళ నుంచి టీడీపీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు.

తాజాగా అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ నేతలు చాలా మంది టచ్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి టీడీపీ తలుపులు తెరుస్తుందా ? ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే వైసీపీని దెబ్బ కొట్టే ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి ఆ విధంగా చూస్తే టీడీపీ తలుపు తట్టిన వైసీపీ నేతలకు చంద్రబాబు వెల్కం చెప్పడం గ్యారెంటీ అనేది కొందరి అభిప్రాయం.

Also Read:అవిసె గింజలు తింటే ఎన్ని లాభాలో..!

- Advertisement -