తిరుపతి విమానాశ్రయంలో అల్లు అర్జున్ అభిమానుల రచ్చ..!

36

హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పుష్ప టీంకు అల్లు అర్జున్ అభిమానులు పూలవర్షం కురిపించారు. అల్లు అర్జున్‌తో సెల్ఫీలు దిగడానికి అత్యుత్సాహం చూపించిన అల్లు అర్జున్ అభిమానులను బౌన్సర్స్ వారిని నివారించలేకపోయారు. దీంతో అక్కడ తోపులట జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని బౌన్సర్లు సహాయంతో అభిమానులను నివారించారు. అనంతరం బన్నీ వాహనాన్ని అభిమానులు కేకకు వేస్తు వెంబడించారు. కాగా, పుష్ప టీం రోడ్డు మార్గాన తిరుపతికి పయనమయ్యారు.