మొక్కలు నాటిన ఎమ్మెల్యే జాజల సురేందర్

51
surender

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విభిన్న కార్యక్రమాలకు వేదికగా నిలుస్తు అందరి చేత మన్నలను పొందుతుంది. ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని ఉత్నూర్ గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి 18వ కళ్యాణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం కి హాజరయ్యారు ఎమ్మెల్యే సురేందర్.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాజల సురేందర్ గారు మాట్లాడుతూ ఉత్నూర్ గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి 18 వ కళ్యాణ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

పర్యావరణం మంచిగా ఉంటేనే ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని దానిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయవ్వ ,MPP అనసూయ రమేష్, ZPTC కమీలి నరసింహులు, MPTC రామచందర్ రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.