సిద్దిపేట ను ఎడ్యుకేషన్ హబ్ చేయాలని కేసీఆర్ ఆకాంక్ష అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలో విద్యపరంగా విద్యార్దులకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు . జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో పిజి కళాశాల నూతన భవనం మరియు లేడీస్ హాస్టల్ ను ఇవాళ ప్రారంభించారు ఎమ్మెల్యే హరీష్ రావు, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… ఈ కళాశాలకు 2014లో 19కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఈకళాశాలను మరింత అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు.
ఈ కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్న నాలుగు కోర్సులతో పాటు మరో రెండు కోర్స్ లను తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపున రావాల్సిన 10కోట్ల రూపాయల కోసం కృషి చేస్తామన్నారు. చాలా మంది విద్యార్దులు హాస్టల్ వసతి తేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.. బాలికల హాస్టల్ కోసం తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. సిద్దిపేట లో రెండు మెడికల్ కళాశాల లు, నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, నాలుగు టెక్నీకల్ ఇనిస్టిట్యూట్,ఒక ఐటిఐ కళాశాల ఉన్నాయని చెప్పారు.
సిద్దిపేట లో యూనివర్సిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్య తో పాటు పేద ప్రజలకు వైద్యం ముఖ్యం కాబట్టి సిద్దిపేట లో మొదట మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత వచ్చేలా కష్టపడాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టు ల వల్ల త్వరలో మత్స సంపద బాగా పెరుగుతుంది.. కనుకఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాలకు చేపలు పంపిణి చేసేలా సంపద పెరుగుతుంది.
జాతీయ, అంతర్జాతీయ మార్మేట్ ను బట్టి విద్య అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏ ఏ రంగాలలో ఎలా ఉన్నాయని తెలుసుకొని విద్యార్థులు కోర్స్ ను ఎంచుకోవాలని సూచించారు.