కరోనా ఫ్రీ తెలంగాణే మా లక్ష్యం అన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు . కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో 70మంది కరోనా బాధితులు ఉన్నారి వారిలో 12మంది కోటుకున్నట్లు తెలిపారు. కొలుకున్న వారిని వెంటనే ఇళ్లకు తరలించకుండా కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు 9లక్షలకు పైగా ఉంటారని వారందరిని ఆదుకుంటామని చెప్పారు. వలస కూలీల కోసం హైదారాబాద్ లో 170శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిజాముద్దీన్ ఘటన తర్వాత అప్రమత్తమయినట్లు తెలిపారు. నిజాముద్దీన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ సమర్ధంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

