సీఎం కేసీఆర్…దళిత బాంధవుడు

108
mla

సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అని కొనియాడారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద తిరుమలగిరి మండలం ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని….తిరుమలగిరి మండలంలో ఇరవై అయిదు వందల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం,తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం,జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసింది. ఈ 4 మండలాల్లో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. త్వరలోనే ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో సమావేశమై విధివిధానాలను ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్.