దళితుల జీవితాల్లో వెలుగులు నింపే పథకమే దళిత బంధు..

86
harish
- Advertisement -

గజ్వేల్ పట్టణంలో కొలుగురు గ్రామానికి చెందిన 129 మంది లబ్ధిదారులకు దళిత దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన పత్రాలు,మరియు యూనిట్స్ మంత్రి టి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, fdc చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇంత మాంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు..దళిత బందు అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని మీ జీవన విధానాల్లో మార్పులు వస్తాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలనుగుణంగా ప్రతిఒక్కరు జీవితంలో స్థిరపడల్లాన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్‌రావు గారు అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల కోసం నేరుగా పది లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.నూతన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ టెండర్లలో ఎస్సీల అవకాశం ఇస్తున్నామని, దళితుల సంక్షేమంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఎస్సీ లతో ప్రారంభమైన కల్యాణ లక్ష్మి తర్వత అన్ని వర్గాల వారికి ఇస్తున్నామని తెలిపారు. దళిత బంధు ఒక పథకం కాదు, ఒక ఉద్యమం అని పేర్కొన్నారు..

అన్ని వర్గాల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటున్నదని అన్నారు. కొలుగురు గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా దళిత బందు పథకం ఇస్తున్నామని గత ప్రభుత్వాలు పార్టీ నాయకులకే ఇచ్చే వారని గుర్తు చేశారు .మాకు రాజకీయాలు అవసరము లేదని అన్నారు.ప్రజలు బాగుపడాలి అన్నదే మా అభిమతం అని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ అభివృద్ధి కోసం చేయి చేయి కలిపి అభివృద్ధి లో ఆదర్శంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజ్మీల్ ఖాన్ , గడ ప్రత్యేధికారి ముత్యం రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ nc రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, రాష్ట్ర రైతుబందు సభ్యులు దేవి రవీందర్,ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం,ప్యాక్స్ చైర్మన్ j. వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, మార్కుక్ కరుణాకర్ రెడ్డి, మద్ది రాజిరెడ్డి, సర్పంచ్లు ఫోరమ్ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణా, వైస్ ఛైర్మన్ జఖి, ఆత్మకమిటి చైర్మన్ మల్లయ్య, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, పండారి రవీందర్ రావు, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, నూనె కుమార్, సర్పంచ్ మల్లం రాజు, ఎంపీటీసీ జ్యోతి స్వామి ,సర్పంచ్లు ఎంపీటీసీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -