మీ ఓటు…రూపాయి బొట్టు‌బిల్లకా..ఆసరా పెన్షన్ కా ?

119
harish

మీ ఓటు రూపాయి బొట్టుబిల్లకా..ఆసరా పెన్షన్‌కా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌ రావు. హుజూరాబాద్ దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌…దేశంలో‌ వ్యవసాయం చేసే రైతుకు సాయం చేసిన ఏకైక సీఎం కేసీఆరే అన్నారు.

నీటి పన్ను, భూమి శిస్తు రద్దు చేసి రైతుకే పన్ను కడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుకు భరోసా ఇచ్చింది తెరాస ,కేసీఆరే….బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ హయాంలో‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు‌కాలిపోయే పరిస్థితి ఉండేదని…కాళేశ్వరం కట్టక ముందు రైతులు‌ సాగు నీటి‌విడుదల‌ కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాళేశ్వరం పూర్తయ్యాక కాలువల‌నిండా నీరే. ఇంక నీళ్లు వద్దని రైతులు ‌చెప్పే పరిస్థితి వచ్చింది…కాలంతో పని లేకుండా రెండు ‌పంటలకు నీరు ఇస్తున్నాం అన్నారు.కరోనా కష్ట కాలంలోను రైతుకు రైతు బంధు ఇచ్చాం…. 25 వేల‌లోపు రుణాలు మాఫీ చేశాం…. ఇప్పుడు 50‌వేల‌లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం…. వచ్చే ఏడాది లక్ష రూపాయల లోపు రైతు రుణాలన్నీ వడ్డీతో‌సహ మాఫీ చేశామన్నారు.

కరోనా కాలంలో ప్రజలకు బియ్యం, పప్పులు వంటి వాటి పంపిణీ కోసం 2500‌కోట్లు, కరోనా మందులు, ఆక్సిజన్ వంటి వాటి‌కోసం వేయి కోట్లు ఖర్చు చేశాం అన్నారు.హుజూరాబాద్ ప్రజలు ఇళ్లు అడుగుతున్నారు….మంత్రిగా ఈటల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఇళ్లు పూర్తి కాలేదన్నారు. మంత్రులకు సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు మంజూరు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా 5 వేల ఇళ్లు కట్టారు. నేను 3600 ఇళ్లు కట్టాను. శ్రీనివాస్ గౌడ్ 3300‌ఇళ్లు‌కట్టారు. మీ పక్క ఎమ్మెల్యే ధర్మారెడ్డి 850‌ఇళ్లు కట్టారన్నారు.

మీ ఓటు ఎటు వైపు…ఈటల పంచే బొట్టు బిల్లకా…కేసీఆరే ఇచ్చే 2016 ఆసరా పెన్షన్ కా.. ?,మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా. ?,మీ ఓటు ఎటు వైపు..కుట్టు మిషన్లకా… కళ్యాణ లక్ష్మికా….?,మీ ఓటు‌ కుంకుమ భరిణికా…రైతు బంధుకా..?,మీ ఓటు..సెల్ ఫోన్లకా….రైతు బీమాకా..? ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు.
మీ బ్రతుకులు వేటితో మారతాయో ఆలోచించండని సూచించారు.