తక్కళ్లపాడ్ రైతువేదిక ప్రారంభం..

81
mla challa

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడ్‌ రైతు వేదికను ప్రారంభించారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మారెడ్డి.. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో రైతు వేదికలు నిర్మిస్తున్నారని….. వ్యవసాయంలో సమస్యలను రైతులు ఒక వేదికపై కూర్చొని చర్చించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల ససకార షంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్ కన్నెబొయిన రాజయ్య యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.