రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్: ఎర్రబెల్లి

53
Errabelli dayakar

వరంగల్ మహానగరం రాష్ట్రానికి రెండో రాజధానిగా వెలుగొందుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ అన్నారరు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో పాలక వర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎర్రబెల్లి…వరంగల్‌ను ప్రణాళికా బద్ధంగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంకణబద్దులై ఉన్నారని పేర్కొన్నారు.

వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రతి ఏటా ప్రభుత్వం రూ.300 కోట్లు వరంగల్ కోసం బడ్జెట్ కేటాయిస్తుందన్నారు.అవినీతికి ఆస్కారం లేకుండా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమలు లోకి తెచ్చామన్నారు.

కరోనా కారణంగా అన్ని పనులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలన్నారు. కరోనా, వరదల సమయంలో ఈ పార్టీలు ఎక్కడకు పోయాయాయని ప్రశ్నించారు.