200 మొక్కలు నాటిన టీఆర్ఎస్‌ నేత సాజిద్ ఖాన్

45
gic

కరీంనగర్ జిల్లా అసిఫ్ నగర్ కి చెందిన TRS నాయకులు గ్రీన్ ఇండియా చాలేంజ్ లో భాగంగా 200 మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దేశాన్ని పచ్చదనం నింపాలని తపనతో ఎంపీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ ఉద్యమం చాలా గొప్పదన్నారు.

నా వంతుగా నేను నా రెండు ఎకరాల భూమిలో 200 పైన మొక్కలు నాటను.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి గ్రీన్ తెలంగాణ కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు…