- Advertisement -
ఈ రోజు హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్య బాల్క సుమన్ కలిశారు. రాష్ట్రం లో 5 లక్షల నుండి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్ సాగు చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న దరిమిలా చెన్నూర్ నియోజక వర్గంలో పామాయిల్ సాగుని ప్రోత్సహించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బాల్క సుమన్.
ఈ తరుణంలో చెన్నూర్ నియోజక వర్గంలోని 5 మండలాల్లో రైతులు కోరిన చోట తగిన రీతిలో విద్యుత్ సౌకర్యం(విద్యుత్ స్థంబాలు,కరెంట్ లైన్)లు కల్పించాలని మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో దానికి తక్షణమే మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించి ఫోన్ ద్వారా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ చైర్మన్ గోపాల్ రావుతో మాట్లాడి చెన్నూర్ నియోజక వర్గంలోని రైతులకి తగిన రీతిలో విద్యుత్ రంగంలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
- Advertisement -