రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు ప‌రిశీలించిన మేయ‌ర్..

254
GHMC Mayor inspects nagarjuna circle
- Advertisement -

నాగార్జున స‌ర్కిల్ జంక్ష‌న్ ఇంప్రూమెంట్ ప‌నుల‌ను మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డితో క‌లిసి న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. ఖైర‌తాబాద్ జోన్‌లోని పంజాగుట్టలో చ‌ట్నీస్ వైపు స్టీల్ బ్రిడ్జితో పాటు, శ్మ‌శాన‌వాటిక వైపు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్టినందున ఫ్లైఓవ‌ర్ కింద ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి విగ్ర‌హం వైపు రోడ్డు రీ అలైన్మెంట్ చేయాల్సి ఉన్నందున మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డికి అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్థితుల గురించి మేయ‌ర్ వివ‌రించారు.

GHMC Mayor inspects nagarjuna circle

మాజీ సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి విగ్ర‌హాన్ని నాగార్జున స‌ర్కిల్‌లో అభివృద్ది చేస్తున్న‌ జంక్ష‌న్ మ‌ధ్య‌లోకి జ‌రిపేందుకు మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి సానుకూల‌త వ్య‌క్తం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప్రావిణ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -