ఈసారి ఖైరతాబాధ్ గణనాథుడు…11 అడుగులే

354
khairatabad
- Advertisement -

ఖైరతాబాద్‌ వినాయక ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాగణనాథుని విగ్రహాం ఎత్తుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 11 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటును విరమించకున్నట్లు కమిటీ తెలిపింది. ఈనెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించింది.

కరోనా కారణంగా దేశమంతటా లాక్‌డౌన్ అమలువుతున్న సమయంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఖైరతాబాద్ వినాయకుడు 2019లో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తుల ముందుకొచ్చాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు.

- Advertisement -