- Advertisement -
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ నేతలు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్బాలు ఎన్నికయ్యారు.
స్టాలిన్ 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు.
1949లో డీఎంకేను స్ధాపించగా కరుణానిధి తొలి అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. మరణించే వరకు అధ్యక్ష పదవిలో కరుణానిధి ఉన్నారు.
- Advertisement -