రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: స్టాలిన్

49
stalin

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టి ఆరు నెలలు గడిచిందని స్టాలిన్‌ పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులతో నిర్మాణాత్మకమైన చర్చలు జరిపేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. చట్టాలను ఉపసంహరించుకునే చర్యలు తీసుకోలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.

నిత్యావసర సరుకుల (సవరణ).. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు తీసుకువచ్చి గత ఏడాది పార్లమెంట్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.