మైనారిటీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి..

165
minister koppula
- Advertisement -

ముస్లింల భద్రత,సంక్షేమం,సముద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్ అన్నారు. ఈయన నాయకత్వంలో పలువురు ముస్లిం ప్రముఖులు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెళ్లి రోజు సందర్భంగా గురువారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రితో కొద్దిసేపు సమావేశమై కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చర్చించారు.

కేవలం 3ఏండ్లలో 4,728మందికి స్వయం ఉపాధి కోసం 55కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 5,231మందికి శిక్షణనిచ్చి పేరొందిన ఐటి కంపెనీలలో ఉద్యోగాలిప్పిచ్చామని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18వందల మందికి ఆటోలు, 300మంది డ్రైవర్లకు 60%సబ్సిడీతో కార్లు ఇచ్చామని చెప్పారు. అగరుబత్తీలు అమ్ముకునే ఫకీర్లకు 50వేల విలువైన మోపెడ్లను ఉచితంగా అందిస్తున్నట్లు హుస్సేన్ మంత్రికి వివరించారు. ఆయనతో పాటు వక్ఫ్ బోర్డు సభ్యుడు వహీద్ అహ్మద్, జహంగీర్ హుస్సేన్, డాక్టర్ ముఫ్తీ మహ్మద్ మస్తానలీ ఖాద్రీ, మహ్మద్ అబ్దుల్ రహీం, సయ్యద్ ఫహీం, మహ్మద్ నాసిర్ మొయినుద్దీన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -