నిర్మాతగా బాలీవుడ్‌ బ్యూటీ..

116

నేటితరం హీరోయిన్లు సినిమాల్లో నటించడమే కాదు.. నిర్మాతలుగానూ సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ తాప్సీ పొన్ను నిర్మాతగా మారుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ‘ఔట్ సైడర్ ఫిలిమ్స్’ పేరిట తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పింది. నిర్మాత, రచయిత ప్రంజల్ ఖండ్ దియాతో కలసి చిత్ర నిర్మాణాన్ని ఆమె చేబడుతోంది. దీని గురించి తాప్సి చెబుతూ, ‘క్వాలిటీతో కూడిన అర్థవంతమైన, వినోదాత్మక చిత్రాలను మా బ్యానర్ పై నిర్మిస్తాం. నాలాగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంట్ వుండి, ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మా సినిమాల ద్వారా అవకాశాలు కల్పిస్తాం’ అని చెప్పింది.

కాగా, ఈ బ్యానర్ పై తొలిచిత్రంగా ఓ థ్రిల్లర్ ను నిర్మించనున్నారు. ఇందులో తాప్సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాగా బాలీవుడ్‌లో ఇప్పటికే 2013లో అనుష్క శర్మ ‘క్లీన్‌ స్లేట్‌ ఫిలిం’, 2015లో ప్రియాంకా చోప్రా ‘పర్‌పుల్‌ పెబల్‌ పిక్చర్స్‌‌’ 2020లో కంగనా రనౌత్‌ ‘ మణికర్ణిక ఫిలిం ప్రొడక్షన్‌’ను స్థాపించి తమ సత్తా చాటారు..