పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌..

34
MP Santosh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టి కర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈరోజు బేగంపేటలోని దేవనార్ అంధుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిన చేశారు. అనంతరం ఉప్పల్ లోని హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , స్థానికులతో కలిసి మొక్కలు నాటారు.

ఉప్పల్ నియోజకవర్గంలో ఉప్పల్ భగాయత్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్ లు, టిఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.