బండి…. కరీనంగర్‌కు ఏం చేశారు?: తలసాని

32
talasani

ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ కరీంనగర్‌కు లక్ష రూపాయల పనిచేశారా అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జమ్మికుంట గండ్ల చెరువులో చేప పిల్లలను వదిలిన అనంతరం మాట్లాడిన తలసాని…సీఎం కేసీఆర్‌ను తిట్టడం తప్ప బీజేపీ నేతలకు ఏమీ చేతకాదని విమర్శించారు.

రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటెల చెబుతున్నారని… చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైనా కొత్తగా చేపట్టిందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అని నిలదీశారు. దళిత బందు తీసుకువస్తే ఎల్లిగానికి, మల్లిగానికి ఇవ్వాలని మాట్లాడున్నారని…ఎవరికి ఇవ్వాలో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. రైతు బంధు రూ.10లక్షలు వస్తే ఈటెల రాజేందర్ ఎందుకు తీసుకున్నారని నిలదీశారు తలసాని.