మ‌త్స్య‌కారుల సంప‌ద‌ను పెంచుతున్నాం- మంత్రి తలసాని

151
- Advertisement -

మ‌త్స్య‌కారుల‌ సంక్షేమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో జీహెచ్ఎంసీ, 29 జిల్లాల‌కు క‌లిపి 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌త్స్య‌కారుల‌ను బలోపేతం చేస్తున్నామ‌ని అన్నారు. మ‌త్స్య‌కారులు ఖాళీగా ఉండ‌కుండా ప‌ని క‌ల్పించాల‌నే ఉద్దేశంతో సంచార చేప‌ల విక్ర‌య వాహ‌నాల‌ను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. ఉమ్మ‌డి రాష్ర్టంలో మ‌త్స్య‌కారుల గురించి ఎవ‌రూ ఆలోచించ‌లేదు. వారికి బ‌డ్జెట్‌లో క‌నీసం నిధులు కేటాయించ‌లేదు. కానీ సీఎం కేసీఆర్ గొప్ప మ‌న‌సుతో బ‌డ్జెట్‌లో వారి కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. రాష్ర్టంలో మ‌త్స్య‌కారుల సంప‌ద‌ను పెంచుతున్నామ‌ని తెలిపారు. మహిళ మత్స్యకారుల‌కు ప్రోత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ఇవాళ పంపిణీ చేసిన వాహ‌నాల‌ను మ‌హిళ‌ల పేరుమీద‌నే ఇస్తున్నామ‌ని మంత్రి త‌ల‌సాని చెప్పారు.

- Advertisement -