‘వకీల్ సాబ్’ డబ్బింగ్ పూర్తి..

244
- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘పింక్’ లో లెజెండరీ అమితాబ్ బచ్చన్ పోషించిన న్యాయవాది పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ పోషించారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలకపాత్రధారులు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి. ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు.

- Advertisement -