సీఎం కేసీఆర్ కృషితో చెరువలకు పునరుజ్జీవం: నిరంజన్ రెడ్డి

113
niranjan
- Advertisement -

సీఎం కేసీఆర్‌ కృషి, పట్టుదలతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు పునరుజ్జీవనం చెందుతున్నాయని వెల్లడించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండలం బుద్దారంలో పల్లె నిద్ర,ఉదయం పెద్దచెరువు దగ్గర కల్వర్టులకు మంత్రి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్‌ రెడ్డి… రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని రైతులు సమృద్ధిగా వాడుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సప్త సముద్రాలకు పునరుజ్జీవం లభించిందని చెప్పారు.

బుద్దారం పెద్దచెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చడంతో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నదని చెప్పారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుకు రెండువైపులా కాలువల నిర్మాణం, చెరువుకట్ట పటిష్టం చేసే చర్యలు చేపట్టామన్నారు. వందల ఏండ్ల క్రితం సంస్థానాధీశులు, కాకతీయ సామంతులు నిర్మించిన సప్తసముద్రాలు, చెరువులు కాలగమనంలో నిర్లక్ష్యానికి గురై శిథిలమయ్యాయన్నారు.

- Advertisement -