టీయూటీఎఫ్ డైరీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..

144
ktr
- Advertisement -

శనివారం నాడు ప్రగతి భవన్లో మంత్రి కే టీ ఆర్ చేతుల మీదుగా 2021 టీ యూ టీ టీఎఫ్ డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ డైరీ ఉపాధ్యాయులకు కర దీపికగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. ఉపాధ్యాయుల పీ ఆర్ సీ ప్రమోషన్ లు బదలీలు పదవీ విరమణ వయసు పెంపు పాఠశాలల మౌలిక సదుపాయాలు తదితర సమస్యల ను మంత్రి గారికి టీ యూ టీ ఎఫ్ తరపున అధ్యక్షుడు మల్లారెడ్డి తీసుకువచ్చారు.

అన్ని సమస్యల పట్ల సానుకూలంగా స్పదించిన మంత్రి కే టీ ఆర్ , త్వరలో ముఖ్యమంత్రి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమం లో స్వర్ణలత కైలాసం, రఘునందన్ రెడ్డీ, డేవిడ్ రియాజ్, శేషాద్రి, సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగేశ్వర్ రావు, మోగులయ్య ,దేవేందర్ రెడ్డీ, సీ హెచ్ మొగులయ్య, శ్రీనివాసు, వీరేందర్ మునీర్ పాష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -