పోలీసుల సేవలు భేష్‌ : మంత్రి సత్యవతి

41
somesh

లాక్ డౌన్‌ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ పట్టణలో లాక్‌ డౌన్ అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన ఆమె…ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా లాక్ డౌన్ పాటిస్తూ కోవిడ్ కట్టడికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. నిత్యావసరాలకు కూడా కుటుంబంలో ఎవరో ఒకరే బయటకు రావాలని, కుటుంబాన్ని కరోనా నుంచి ఎప్పటికప్పుడు రక్షించుకోవాలని సూచించారు.

సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏడాది లాక్ డౌన్ కు నాలుగు గంటలు మినహాయింపు ఇచ్చిన సమయంలో ప్రజలు గుమికూడకుండా ఉండేందుకు, కోవిడ్ నిబంధనల మేరకు నిత్యావసరాలు తీసుకునేటట్లు పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.

గ్రామాల్లో కోవిడ్ కట్టడి, గుర్తింపు, చికిత్స కోసం వేసిన గ్రామ కమిటీల్లో కూడా పోలీసులు నిత్యం వారితో ఉంటూ లాక్ డౌన్ అమలు అయ్యేటట్లు, కోవిడ్ బారిన ప్రజలు పడకుండా ఉండేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు.