మత్య్సకారుల సంక్షేమానికి వెయ్యి కోట్లు: సబితా ఇంద్రారెడ్డి

189
sabitha
- Advertisement -

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు మండలం కొత్తగూడ సున్నం చెరువులో చేప పిల్లలను వదిలిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రూ 52 కోట్ల నిధులతో సబ్సిడీపై 82 కోట్ల చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నామని తెలిపారు సబితా.

మృత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గతేడాది సున్నం చెరువు ద్వారా రూ. 2 లక్షల ఆదాయం రావటంపై ఆనందం వ్యక్తం చేసిన సబితా….వచ్చే ఏడాది చేప పిల్లల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -