అన్నిరంగాల్లో ఇల్లందు అభివృద్ధి: మంత్రి పువ్వాడ

105
puvvada

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆం బజార్ లో ఒక కోటి అరవై ఐదు లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ కుమార్ , ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్…ఈ సందర్భంగా మాట్లాడిన పువ్వాడ అజయ్‌… ఇల్లందు ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి బాధ్యత తనకు అప్పజెప్పారని …ఇల్లందును అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉరుకులు పెట్టిస్తున్నామని చెప్పారు.

ఇల్లందులో బస్సు డిపోను దసరా కు శంకుస్థాపన చేసి కొత్త సంవత్సరానికి కానుకగా అందిస్తాం అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సీతారామ ప్రాజెక్టు నీళ్ళు అందేలా చేస్తాం అని తెలిపారు.