ఎల్లారెడ్డి చెరువులో చేపపిల్లలను వదిలిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

53
prashanth reddy

మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలను చేపడుతోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎల్లారెడ్డి చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్, ఎంపీ బిబి పాటిల్, జిల్లా కలెక్టర్ శరత్,మత్యకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి…సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదు…అట్లాంటి రాష్ట్రాలతో మత్యసంపదలో పోటీపడి నీలివిప్లవం వైపు పయనిస్తున్నాం..ముఖ్యమంత్రి కేసీఆర్ మత్యకారుల మోముల్లో సంతోషం నింపారు..

82 కోట్ల చేప పిల్లల కోసం 52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు.దీనివల్ల మత్యకారుల కుటుంబాలకు దాదాపు 11 వందల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది..కామారెడ్డి జిల్లా లో ఇవాళ ఎల్లారెడ్డి లోని అడ్లూరు చెరువులో ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన,ఎంపీ,కలెక్టర్ ఆధ్వర్యంలో చేప పిల్లలు విడుదల కార్యక్రమం జరిగిందన్నారు.

ఈ చెరువులో 3లక్షల 20 వేల చేపలు వదలాలని టార్గెట్ పెట్టుకున్నాం..కామారెడ్డి జిల్లాలో మొత్తం 578 చెరువులు ఉన్నాయి..వాటిల్లో 3 కోట్ల 35 లక్షల చేపపిల్లలను 3 కోట్లు ఖర్చు చేసి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.దీని ద్వారా జిల్లా మత్యకారుల కుటుంబాలకు 70కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది..దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మత్యకారుల కోసం లేవు..తెలంగాణ లో కూడా చేపలు పెంపకం ఇంత గొప్పగా ఉంటుందా అని దేశమే అబ్బుర పడుతుంది..గతంలో నాయకులు హామీలు ఇచ్చారు.. కానీ చేయలేదు..ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల వృత్తులను,వర్గాలను సమానంగా ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి రెండో సారి అఖండ మెజార్టీతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు..

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ యువకుడు.. మృదు స్వభావి..నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం తాపత్రయ పడుతుంటారు..వారి హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు.