వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి- మంత్రి

45
minister srinivas goud

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవితో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో సమావేశమైయ్యారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ రావు, కార్యదర్శి లలిత రెడ్డి, మురళీ కృష్ణ, సొసైటీ కార్యదర్శి రవి ప్రకాష్, కరుణాకర్ గౌడ్, నరేందర్ గౌడ్, న్యాయ వాదులులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వాణీదేవి పట్టభద్రుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఆమెను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.